మృతి లేని శృతి

మల్లినాధ సూరి కళాపీఠం

*మృతి లేని శృతి. విజయ గోలి

గగనమంత ఎదిగిన గాన గంధర్వుడా
సుస్వర అశ్వాల అధిరోహణా దిత్యుడా
నిత్యబాలుడవే ..నిన్నేల పిలిచె ఆ విధి..
కాలగ్రహణం నిన్ను కబళించె..కనికరము లేక
ఈ అర్ధాంతర అస్తమయమేల…అవనిపై

గానాభిషేకమే చేగొన్న శివుడేమి తలచెనో..
మార్కండేయుని మాట మరిచినాడేమొ
తెలుగుమాటకు తేనెకలిపిన పాట కదా నీది
అక్షరాల ఉచ్ఛరణే లక్ష్యమైనది కదా..
నీ పాటయేగద చిత్రసీమన సాహిత్య సారధైనది

నీ పాటతోనే గద తెలుగింట తెల్లవారేను
ఎన్ని దైవాల నీ స్వరమున మేలుకొలిపావో
రమణీయ నీ గానలహరిన మురిపమిచ్చావో
స్వరకాయ ప్రవేశముల స్వరఝరులు నీవిగా…
అనునయ గాత్ర అభిషేకివే ..అమరమే..
గాలిలో గాలిగా నీ గానమే వీనుల విందైనది.

ఎన్ని మనసుల ఊరడింపుల ఊయలూపావో
ఎన్ని మనసుల ప్రేమఊసుల జతలు చేసావో
ఎన్ని మనసుల వేదనలకు శాంతమయ్యావో
చిన్నిపాపల కంటికునుకుకు లాలివయ్యావో

బాహ్యరూపాన బహు దూరమైనావె గాని
గుండె నిండిన నీపాట గూడు మారదు కద
మరణమెక్కడ నీకు మృతి లేనిదేకద నీశృతి
అందుకోవయ్యా అమరుడా మా అశ్రు అంజలి 🙏🏻🙏🏻🙏🏻😢😢

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language