*సత్యమేవ జయతే. విజయగోలి
ఏది సత్యం ఏదసత్యం
ఎండమావుల వేడుక
మనిషిలోని కపటమంతా
మనసు వెనుక మర్మమేగా
అంతరంగం అసలు సత్యం
అద్దమెపుడు చూపు అసత్యం
విలువలెపుడు బాహ్యానికే
వింతపోకడ మనిషిదే
దేవుడెదుట భక్తి నటన
లింగమేదో మింగు లోచన
మనసులోపల తొలిచివుండు
భంగపడు కాలమేదో వుంది
ఆత్మలోని పరమాత్మ ఎక్కడో
అల్పమైన ఆయువొక్కటే సత్యం
అలవిగాని ఆశ బ్రతుకే నిత్యం
ఆశతీరగ ఆసరాగా అసత్యం
సత్యమేవ జయతు అంటు
సాధించిన ప్రగతి మార్గం
అనుక్షణం అనుసరణల
ఆవహించును దైవతత్వం