*అవని కి అతిధి విజయ గోలి
రెప్పవిప్పితె జననం..
రెప్పమూసితే మరణం..
నడుమ బ్రతుకు నాటకం
మిధ్య తెలిసితే బాట సుగమం
నీ రేపు రాసున్నది ఎపుడో…
తప్పని పయనమే తెలుసుకుంటె
పాపపుణ్యపు పరమగతులే
వెంటవచ్చు ధనపు మూటలు
అవనికి అతిధిగా మాత్రమే వచ్చావు
అత్యాశతో అంతా నాదేనంటావు
తరాల కోసం తపన పడుతున్నావు
ఎన్ని తరాలైనా తరలిపోక తప్పదని
చెప్పకనే చెపుతున్న చరిత్రలే చూడు
అస్థిరమే బ్రతుకంతా..
స్థిరమైన మాయ ముసుగున
కడఏమిటి …కనుగొంటే
ఏడుకట్ల ఏడుపు రధమే
అవని ఒడిలో ఆఖరి పడకే