శ్రీమల్లినాధ సూరి కళాపీఠం. ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 15/9/2020
అంశం-:దృశ్య కవిత
నిర్వహణ-:శ్రీమతి సంధ్యారెడ్డి గారు
రచన-:విజయ గోలి
శీర్షిక-:మరపు చెలిమి
మరపుకు అందని
ఏ మనాది అయినా
గుండెపిండే గురుతులు
నిండిన గాయమేగదా
వేలమంది మధ్యనవున్నా
వేడుకలేని మనసేవుంది
నిర్లిప్తపు తెరలను దించి
నిర్వేదపు నీడలనుంది
చుక్కల పరిచిన ఆకాశాన్నే
పరికిస్తున్న ప్రతిరోజూ
తళుకుమనే తారలలో
వెతుకుతు ఉన్నా దరహాసాన్నే
కురవని ఆశల మేఘమే
ఆరని తడి చారికలే
ఆర్తిని ఆపని భావాలే
అనుభవమాపని ఆవేదనలే..
ఏ గాయమైన కాలము చాటున కరిగేదే
మరుపు చెలిమితో మలిగి పోవునదే