శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి. 14/9/2020
అంశం-:కవన సకినం దేహమంతా దేశభక్తి
నిర్వహణ-:శ్రీమతి గీతాశ్రీ స్వర్గం గారు
రచన-:విజయ గోలి
మహోన్నత హిమవన్నగ శిఖరమే నాదేశం
ఎలుగెత్తిన వందేమాతర గీతమే నాదేశం
విశ్వవీధిన విహరించే త్రివర్ణమే నాదేశం
వేదవిజ్ఞాన తొలివెలుగు కిరణమే నాదేశం
జైజవాన్ జైకిసానులే జన్మభూమి సిద్ధాంతం
వసుధైక కుటుంబమే సిరివరాల కదంబం
సరిహద్దు త్యాగనిరతి సుస్వరాల సందేశం
నాదేహంలో ప్రజ్వరిల్లు నాదేశగీతి సంస్కారం