శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 8/9/2020
అంశం-:దృశ్యకవిత గూటిలో గువ్వలమై
నిర్వహణ-:శ్రీమతి సంధ్యా రెడ్డిగారు
రచన-:విజయ గోలి
శీర్షిక-:గుండె సవ్వడి
ఒక్క గూటి గువ్వలం
చిక్కనైన చీకటిలో
చిరునవ్వుల దివ్వెలం
ఆశలొకటిగ శ్వాసలొకటిగ
అల్లుకున్న అందమైన గూడు
చిరు గువ్వల కువకువల
చిరురెక్కల సవ్వడి
గింజ గింజ వెతికి తెచ్చి
కంటి వెలుగు కాగడా తొ
కాపుకాచి పెంచాము
జడివానల ఆకుల దుప్పటి
నడి ఎండల కొమ్మల ఊరడి
ఒడిదుడుకుల ఓటములే
ఎదురు నిలిచి గెలిచాము
రెక్కలొచ్చి ఎగిరాయి
రివ్వుమంటు గువ్వలు
గూడు వదిలిన గువ్వలెపుడు
గుండెనిండుగ వున్నాయి
గుబులు నిండిన గూడైన
ప్రేమ నిండిన గుండెలతో
గుండె గురుతుల సవ్వడితో
ఒకరికొకరుగా ఒక్క గూటి గువ్వలమే