మల్లినాధ సూరి కళాపీఠం
శాంతి మంత్రము విజయ గోలి
శాంతిమంత్రం
మారుతున్న లోకంలో
జారుతున్న మనశ్శాంతి..
జాగరణలె మిగిలాయి..
బయటినుండి శాంతి ..
రాదెపుడూ… కానుకగా..
నిన్ను నీవు చూసుకుంటె
నీలోనె దాగున్నది ప్రశాంతి..
అత్యాశలు ..అసంతృప్తి
మూలమెపుడు అశాంతికి
శ్వాసపైన ధ్యాస నిలుపు..
ధ్యానాలే ..మార్గాలు
ఎదుటివాని ..మేలుకోరి చూడు..
మదినిండును ..హాయితోడు
మంచి వ్యాపకాలే మిత్రులుగా..
ఎంచుకుంటే..ఎదురేది..
పంచుతుంటే ఏదైనా..
పెంచుతుంది…మనశ్శాంతి
నిబద్ధతలె ప్రామాణిక మైతె
మనసు నిండి వుంటుంది శాంతిమంత్రమై…
ఎదుటివాని ..మేలుకోరి చూడు..
మదినిండును ..హాయితోడు
మంచి వ్యాపకాలే మిత్రులుగా..
ఎంచుకుంటే..ఎదురేది..
పంచుతుంటే ఏదైనా..
పెంచుతుంది…మనశ్శాంతి
నిబద్ధతలె ప్రామాణిక మైతె
నిలువెల్లా విలువలతో..
బ్రతుకు నిలకడయ్యేను..
మనసునిండి పోయేను ….శాంతిమంత్రమై…