*ఋణానుబంధం
రచన- విజయ గోలి
ఏ దిశలో జననమో
ఏదశలో మరణమో
ఎవరు నీవెనుక
ఎవరు నీముందు
ఎరుక నీబ్రతుకు
ఏకాంబరుడొక్కడే
కలిసేదెవరో..విడిచేదెవరో
ఒంటిగ వచ్చిన నిను
కడకు కాటికి మోసే
నలుగురు ఎవరో..
కర్మ బంధాల బరువుల
గతి తప్పని పయనం
తరాల పెంచే తపనలతో
తన మన మరచావు
సిరులు ఓకటే స్థిరమంటావు
అతిధివి మాత్రమే అవనికి
ఆట తెలియకున్నావు
నీ నడతల కొలతలే
నినుమోసే నలుగురు
ఇచ్చి పుచ్చుకున్న
నీ ఋణాను బంధాలే
నీవెంట నడుచు నలుగురు
తనువు రాలిపోయిన
తరించి బ్రతికినదే జన్మము
మరణించిన పిదప కూడ
బ్రతుకుటేగ అమరము