ఋణానుబంధం

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం  ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణముల సింగిడి 30/12/2020
అంశం-: తాత్వికం. ఆ నలుగురు ఎవరు
నిర్వహణ -: పూజనీయులు శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు
రచన- విజయ గోలి
ప్రక్రియ – వచన కవిత

*ఋణానుబంధం

 దిశలో జననమో

ఏదశలో మరణమో 

ఎవరు నీవెనుక 

ఎవరు నీముందు

ఎరుక నీబ్రతుకు

ఏకాంబరుడొక్కడే

కలిసేదెవరో..విడిచేదెవరో

ఒంటిగ వచ్చిన నిను

కడకు కాటికి  మోసే 

నలుగురు ఎవరో..

కర్మ బంధాల బరువుల

గతి తప్పని పయనం

తరాల పెంచే తపనలతో

తన మన మరచావు

సిరులు ఓకటే స్థిరమంటావు

అతిధివి మాత్రమే అవనికి

ఆట తెలియకున్నావు

నీ నడతల కొలతలే  

నినుమోసే నలుగురు

ఇచ్చి పుచ్చుకున్న

నీ ఋణాను బంధాలే

నీవెంట నడుచు నలుగురు

తనువు రాలిపోయిన 

తరించి బ్రతికినదే జన్మము

మరణించిన పిదప కూడ

బ్రతుకుటేగ అమరము

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language