కాటుకరేఖల కాంతులు లేవనకు
కలువలు మించిన కనులే నీవిగ
కాసుల గుళ్ళ హారమె లేదనకు
కనకము మించిన గుణమే నీదిగ
ముక్కెరమెరుపు పెదవులఎరుపు
నీకు పెట్టనినగలే వన్నెలచిలకా
నాణెపునవ్వులు కొప్పునపువ్వులు
గౌరిని మించిన గొప్ప రూపమే నీది
గాలికొసరిన గంధమునీవు
మంచిముత్యాల మాటల సరాలు
నయగారాలే నడకలలోన
హంసలమించిన సొగసులు నీవే
అలసినవేళ అమ్మవునీవె
నీలికనులకు లాలివి నీవె
అలరింపుల లో మధురిమ నీవె
ఆమనిమించె అందమెనీవు
రాయిని తాకి రత్నముచేసావు
కరిగించావు కరకు మనసుని
దేవుడిచ్చిన వరమేనీవు
ప్రేమను పంచిన పెన్నిధి నీవు
గుండె గుడిలో దేవతనీవు
నీ ముంగిట వెలిగిన దివ్వె ను
నీ పదముల నిలచిన పువ్వును
జన్మజన్మల బంధమే నేను