మల్లినాధ సూరి కళాపీఠం
బంధాల తాళం విజయ గోలి
ఆశలతో అద్దాల మేడలు
ఆకాశానికి నిచ్చెనలు
నీడల చాటు నిజాలు
క్షణం క్షణం బ్రతుకు భయం
ఛిద్రమైతే చావు నీడ
బాధ్యతలే బరువంటూ
భయపడితే భావి లేదు
అందుకున్న అవకాశం
పెంచుతుంది విశ్వాశం
బంధమెంతో సుందరం
అల్లుకున్న తీగలతో
బంధనమే ఆనందం
బంధాల తాళమెపుడు భద్రం
బ్రతుకు బాట పూలతోటి స్వాగతం
చిన్నదైన జీవితంలో
చింతల దారెందుకు..
చిట్టి పొట్టి చీమ కూడ..
బరువు మరుచు బాధ్యతల బాటలో
*కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే ఆహ్లాదం
బరువులన్నీ బంధాలతొ పంచుకంటె ఆనందం