మల్లినాధ సూరి కళాపీఠం
అతివ ఒక బహుమతి. విజయ గోలి
ప్రతి ఇల్లు కోవెల ఐతే
వెలసిన దేవేరే ఇల్లాలు
ప్రతి ఇంటను నిండుగా.
ఆవరణలో తులసిగా..
వెలుగుపంచు వెన్నెల దీపం
అనుబంధాల పందిరికి
ఆత్మీయ ఆధారం
అమ్మగా అత్తగా
కూతురుగా కోడలిగా
వలపుల చెలిగా
మురిపాల చెల్లిగా
ముంగిట రంగవల్లిగా
భిన్నత్వంలో ఏకత్వం
ఏడడుగుల బంధం
సంసార రధానికి
సామరస్య సారధిగా…
సాంగత్యపు వారధిగ
సంతానపు సంరక్షణలో
సంస్కారపు పెన్నిధిగా
ఒదిగున్న ఓర్పుగా
విధులందున విమలగా
సాటి రాని మేటి తాను
గృహసీమకు సామ్రాజ్ఞి
బదులడగని బహుమతి