అంశం -:పురాణం. స్వర్ణ కవచాలంకృత దుర్గమ్మ
నిర్వహణ -: శ్రీ బి వెంకట కవి గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ-: వచన కవిత
కృష్ణవేణి సరసన ఇంద్ర కీలాద్రి పై
ఇంపుగ వెలసిన బంగరు దుర్గవు
కరుణను చూపే కనక దుర్గవు
దురితములాపుము దుర్గవు నీవై
నవరాత్రులలో పాడ్యమి రోజున
ప్రధమ దుర్గవై పరమ పూజ్యగ
స్వర్ణకవచమున సింహవాహినివై
అష్టభుజముల సాయుధపాణిగ
దుష్టశిక్షణ శిష్టరక్షణల కావుము తల్లీ
కామితాలు తీర్చే కాత్యాయనిగా
కోరిన వారికి కొంగు బంగారమై
చీడల పీడల నాశము చేసి
అష్టైశ్వర్యముల ఆయురారోగ్యముల
అవని కాయవే స్వర్ణదుర్గవై