జతకలవని జవాబులే ప్రశ్నలుగా మిగిలిపోవు
కలవలేని రాతలతో కల్లలుగా మిగిలిపోవు
కనులచాటు కల్పనేదొ అనుభవమై అద్భుతమే
తపియించిన బంధమేదొ తపనలుగా మిగిలిపోవు
నిన్నునన్ను కలబోసిన కలలతోటి అభిషేకం
మదికోవెల దైవానికి పూజలుగా మిగిలిపోవు
కనులాడిన బాసలెపుడు కమనీయం కానుకగా
ఆమాటల సడిఎపుడూ మంత్రాలుగ మిగిలిపోవు
అడుగడుగున మేలుకొలుపు విజయాలుగ నిలిచిపోవు
దరిచేర్చే దారులలో వెలుగులుగా మిగిలిపోవు