మల్లినాధసూరి కళాపీఠం
అమ్మ స్పందనే ప్రోత్సాహం..
తప్పటడుగు తరుణంలో ..
వ్రేలుపట్టి నడక తోడుగ
నడత నేర్పిన నాడు
నాన్న నీడే ప్రోత్సాహం
అక్షరాలు దిద్దు రోజు
చేయిపట్టి ముద్దుగా
చదువు విలువ నేర్పిన
గురువులదే ప్రోత్సాహం
అడుగడుగున నీ బాటలో
ఆసరాగ అందించిన చేతులెన్నో
విజ్ఞతతో విచారించి..అందించు
నీ ప్రోత్సాహం ..అందని ..కొందరికైన …
జీవితాన ఉన్నతంగ ఎదగాలంటే…
వెన్నుతట్టి బుజ్జగించి భుజమిచ్చే
మనసొకటి ప్రతి మనిషికి తోడుంటే
అంబరమే అవలీలగ అందుకదా…విజయ గోలి