శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి 16/8/2020
అంశం-:మాటే మంత్రం
నిర్వహణ-:శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు
రచన-:విజయ గోలి. గుంటూరు
ప్రక్రియ-:వచన కవిత
శీర్షిక-: తేనెలూరు పలుకు
బాంధవ్యపు కదంబాల
అల్లికలో …బంధించే..
అనురాగపు దారమే …మాట
ఆమాటే మంత్రమైతే..
మనసులలో…విరపూయును
మంచితనపు మల్లెపూలు
అమ్మ మాట మంత్రమైతే
ఆగడాలు చెల్లవింట..
పట్టు విడుపు మంత్రముతో
పాయసమే వండునంట
నాన్న మాట మంత్రమైతే
ఇంటింటా నవ్వుల పంట
నడతలోన కిటుకులన్నీ..
మిఠాయిలుగ పంచునంట
గురువు మాట మంత్రమైతే
నడకంతా బంగారు బాటంట
నీ మాటే తేనెలూరు పలుకైతే
ఇరుగు పొరుగు..ఇంట బయట
విజయాలే…నీ బాటన..