మల్లినాధ సూరి కళాపీఠం
సుగంధాల కదంబమే నా దేశం*
నాదేశం..ఎంత మధురమైన పదం
ఎంత శక్తివంతమైన పదం
ఎన్నెన్నో త్యాగాల ఫల దానం
మరెన్నో జీవితాల బలిదానం
తల ఎత్తితే భారతమాత శిరమున ..
వన్నె తరగని వజ్ర మకుటం
స్వేచ్ఛకు ప్రతీకగా హిమాచలం
కమనీయ వెలుగుల కాశ్మీర సింధూరం ..
తలదించితే నా తల్లి పాదపీఠం
కన్యాకుమారి కనక మంజీరం
వేదఘోషలు ప్రతి ధ్వనించే …
దివ్య భారతి నాదేశం ..
నా దేశమంటే మట్టి కాదు ..
మంచి మనుషుల మనుగడే సందేశం ..
సర్వ మతముల,సకలజాతుల ,
సుగంధాల కదంబమే నాదేశం…విజయ గోలి