నా పల్లె అందాలు

శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 30/8/2020
అంశం-:నాపల్లె అందాలు వర్ణించ తరమా
నిర్వహణ-:శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు
శీర్షిక-:*ఆకుపచ్చ చీరకట్టు*
రచన-:విజయ గోలి

పచ్చపచ్చని పల్లెటూరులు
పసిడిపంటల అందాలు
పరవశమౌ పిలుపులు
పలకరించు బంధాలు

అన్నిఋతువులు నావేనంటూ
తొలకరి పాటల తొలి చరణాలు
ధాన్యపురాశుల ధరణి గీతము
రైతురాజుల కనుల వెలుగు
సంకురాత్రి జిలుగు

కోడికూత మేలుకొలుపు
కొమ్మపైని కోయిలమ్మ
పలకరింపు పాటలు
రాములోరి కోవెలలో
జేగంటల సవ్వడులు

మోటబావి కబురులు
చెరువు గట్టు చర్చలు
నిండుకడవ మోతలతో
పల్లెపడుచు వంపులు
రాలుగాయి కుర్రోళ్ళ
కోతల కొడవళ్ళు

ఆకుపచ్చ చీరకట్టు.
ఇంద్రధనుస్సు రంగులలో ఇంపుగాను..
వర్ణంచగ వర్ణాలే (అక్షరాలు)చాలవు
దేశానికి ప్రగతి మెట్లు
పల్లెటూరి ప్రతి చెట్టు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language