కార్తీకం

శ్రీఅమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం

సప్తవర్ణాల సింగిడి 24/11/2020

అంశం-: కార్తీక మహోత్సవం. అలంపురం జోగులాంబ

నిర్వహణ -: శ్రీ వెంకట్ కవి గారు

శ్రీమతి సంధ్యా రెడ్డి గారు

రచన-: విజయ గోలి

ప్రక్రియ -: వచన కవిత

ప్రతి రోజు పురాణానికి సంబంధించి పూర్ణ సమాచారాన్నిచ్చి .భక్తిపరమైన రచనలు చేసేందుకు ప్రోత్సహిస్తున్న కవివర్యులు శ్రీ బి వెంకట్ కవి గారికి హృదయపూర్వక  ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

అష్టాదశ పీఠాల పంచమపీఠమై

అలంపురం జోగులాంబగ అలరించినావు

సతీదేవి పైపన్ను పడినదనే నానుడి

రౌద్ర రూపమున జటాధారివై నీ రూపము

నిత్యమైన నీదర్శనమే కోటిలింగ అభిషేక ఫలము

సత్యమున్న తల్లివి సర్వ మంగళ గౌరివి

పంచశక్తి పీఠమే పంచభూత పూజితవు

జోగులాంబవవైన నీవె భ్రమరాంభ వైన నీవె

తుంగభద్ర కృష్ణమ్మ సంగమించిన స్థలము

బ్రహ్మార్చిత లింగమే బాలబ్రహమేశ్వరుడు

నవ బ్రహ్మల ఆలయాల నందనమే

దక్షిణకాశిగ  ధరణి నిలిచే నీ సదనము

రససిధ్దుల కధలెన్నో రమణీయం

జోగులకు అమ్మగా జోగులాంబ నీవు

రేణుకా ఎల్లమ్మవు కరుణించె కల్పవల్లివి

కోరి కొలిచిన చాలు కొంగు బంగారమే నీవు

అమ్మలగన్న అమ్మగ కాపాడుమమ్మ కనకవల్లిగ

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language