శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి 11/10/2020
అంశం-: హృదయ స్పందనలు. చేతివృత్తులు
నిర్వహణ-:శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు
రచన-:విజయ గోలి
ప్రక్రియ-:వచనకవిత
శీర్షిక-: ప్రగతి వెలుగులు
చెదిరిపోయెను చేతివృత్తుల
సంబరము..భావి లేదిక ..
బ్రతుకు తెరువు కళలకు
ఇగిరిపోయెను విత్తు లేకనె
యంత్రబలమే ఎదిగి పోయెను
పల్లెటూళ్ళ పందిరి కమ్ములు
పట్నంమోజున పక్షులైనవి
రంగురంగుల బుట్టలల్లే
మేదరన్నకు మెతుకు లేదు
మట్టి తొక్కి సారె తిప్పే
కుమ్మరన్నకు కూడులేదు
నాటువేసి కలుపు తీసి
పంటకోసి ఇల్లు చేర్చే ..
రైతుబతుకు న యంత్రమొచ్చెను
గాంధీ ఎంతో పోరు చేసెను
చేతివృత్తుల నిలపమంటుూ
వృత్తి విద్యల శిక్షణలో వనరులెన్నో
ప్రగతి బాటన నామ మాత్రమే..
ముందుతరములు ఆధునికత
అవసరాల అదును తెలిసి
వృత్తిబాటన ముందుకెళితే.
వెనుకబడినవి ముందుకొచ్చును..
పల్లెటూళ్ళకు మళ్ళీ పట్టు దక్కును