శ్రీ మల్లినాధసూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం
సప్తవర్ణముల సింగిడి 3/1/2021
అంశం-:హృదయ స్పందనలు స్వప్న వీధిన సగటు మనిషి
నిర్వహణ-: శ్రీమతి అంజలి గారు
రచన-:విజయ గోలి
ప్రక్రియ-: వచన కవిత
కనురెప్పల క్రింద
కదలాడే కల
కడలిపైన
ఊగాడే అల
సుషుప్తి లో
సుందర స్వప్నం
అలౌకికం
రెప్పలు విప్పలేని
తాధ్యాత్మం
జాగృతిలో
జ్వలించే కల
సాధనలో
శిల్పి చేతి ఉలి
సాకారాల
సౌందర్య కిరీటం
పగటికలల
పరిహాసం
కాలం కౌగిటిలో
కరిగి పోయే
చిద్విలాసం
శ్వాసలో ఆశ
అనుశ్వాసిస్తేనే
కన్న కలలకు
శిఖరారోహణ
విజయ కేతనం
కంటున్న కలలే
మనిషి చైతన్యానికి
సాక్షీ భూతాలు
మనుగడ శాసించే
మహా యాగాలు
కలలు కంటూనే ఉండాలి
వీగినా ఊగినా..