గజల్ విజయ గోలి
మనిషిముందు మధువులనే వొలుకుతారు ఎందులకో
మనసువెనుక విషములనే నింపుతారు ఎందులకో
వెనుకవెనుక వుంటూనే వెన్నుపోటు పొడిచేరుగ
తేనెపూసి కత్తులనే దింపుతారు ఎందులకో
శిథిలాలలొ పెన్నిధులే దొరుకుతాయి వెతుకాడితే
స్నేహానికి పరిధిగీసి పెంచుతారు ఎందులకో
ఎదలోపల సొదలేమో చెప్పుకుంటె తరిగేనుగ
మనవారను మాయలోన ఉంచుతారు ఎందులకో
లోకతీరు తెలుసుకుని తెలివితోను మసలకుంటే
నవ్వుతూనె నట్టేటిలో ముంచుతారు ఎందులకో