రచన-:విజయ గోలి గుంటూరు
శీర్షిక -:*దివ్యమైన దివ్వె*
విధాత తలపున మెరిసిందొక మెరుపు ..
మలిచాడొక …దివ్యమైన …దివ్వెగా..
కమ్మనైన ..అమ్మతనం ..ఆజ్యంగా..
అవని మీద …ప్రేమ ..అమృతాన్ని…
పంచమంటు …పంపాడు ..బ్రహ్మగ..
జీవితంతో ..పోరాడి..జీవనాన్ని ఇచ్చేదె…అమ్మ
అమ్మంటే…గుమ్మపాల తియ్యదనం
అమ్మంటే అనురాగపు వెచ్చదనం
తొలిసారిగా ప్రేమ రుచిని ..చవి చూపిన దేవతేగ..
తొలి గురువుగ జీవితాన ..శ్రీకారం అమ్మే కదా…
తప్పటడుగు సరి చేసె…గొప్పతనం ..అమ్మదేగా..
ఎల్లలు..లేని ప్రేమను కొల్లలుగ ..
పంచటం అమ్మకేగా సాధ్యం ..
అనుబంధాల పందిరికి ..
అమ్మే కదా ఆధారం..
బ్రహ్మ బదులు అమ్మైతే …
అమ్మ బదులు పదమే లేదు..
భాషలలో ..భేదమున్న. అమ్మ
భావనంత ..ఒకటేగ..
విశ్వమంతా నిండి వున్న
మధురమైన పదమేగద అమ్మ…
ప్రకృతంటే అమ్మేగా…అవని అణువణువున…అమ్మేగా
అమ్మ లేని సృష్టి ..అసలు లేనె..లేదుగా.