శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం
ఏడుపాయల .అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి
అంశం-: ఐచ్ఛిక కవిత
నిర్వహణ-: శ్రీ తుమ్మా జనార్ధన్ గారు
రచన -:విజయ గోలి
శీర్షిక-: నిరీక్షణ
వెన్నెలంతా వేడుకగా చూస్తుంది
జాబిలమ్మ జాలిచూపు ..ఈసునే రేపుతుంది..
ఝాము గడచి ఝామాయె ..
నీ జాడలేక పోయె…నల్లనయ్యా
యమునమ్మ యెద లోపలి
సొదలనే అడుగుతుంది..
కలువలన్నీ ..వలువలనే విప్పార్చి
క్రీగంటను మేలమాడు ..
విరులన్నీ విరబూసి…
వీవనలతో నిలిచాయి
పొదరిల్లు పరిహాసం..
పంతమాడుతుంది….
కరుణిచవు కన్నయ్యా
కినుక ఏలనయ్యా…
ఏడ నీవు నిలిచావొ..
ఏ దారి నీవు కాచావొ
ఏ గుమ్మ నిన్ను దాచినదో
ఏ గుండె గుడిలొ వేలుపువో
అలల తడిచిన మువ్వలె సడిని మరిచాయి..
వేడుక చేయగా ..నీవేణువైన వినపడదు
వేగుచుక్క జారేలోగ వేగమేల రావు…