అంతరాష్ట్రీయ బాలికా దినం….విజయ గోలి
పిండం నుండే మొదలైన వివక్షలు ..
వయసుతో పెరుగుతున్న ఆంక్షలు ..
రాళ్లు కొట్టినా ..రాజ్యాలేలినా ..
అంతరిక్షయానాలు చేసినా ..
అడుగడుగున తప్పని లక్ష్మణ రేఖలు..
క్షణం క్షణం జరుగుతున్న లైంగిక దాడులు ..
ప్రతి క్షణం చచ్చి బ్రతుకుతున్న …
ముక్కు పచ్చలారని ముద్దు పాపలు.
సంబరాలు చేద్దామా …సంతాపం చెపుదామా …