*మరపు చెలిమి విజయ గోలి
మరపుకు అందని
ఏ మనాది అయినా
గుండెపిండే గురుతులు
నిండిన గాయమేగదా
వేలమంది మధ్యనవున్నా
వేడుకలేని మనసేవుంది
నిర్లిప్తపు తెరలను దించి
నిర్వేదపు నీడలనుంది
చుక్కల పరిచిన ఆకాశాన్నే
పరికిస్తున్న ప్రతిరోజూ
తళుకుమనే తారలలో
వెతుకుతు ఉన్నా దరహాసాన్నే
కురవని ఆశల మేఘమే
ఆరని తడి చారికలే
ఆర్తిని ఆపని భావాలే
అనుభవమాపని ఆవేదనలే..
ఏ గాయమైన కాలము చాటున కరిగేదే
మరుపు చెలిమితో మలిగి పోవునదే