వస్తావని. విజయ గోలి
కనుల నిండిన రూపము
కన్నీటితో జారిపోతుందని
కన్నీటిని కట్టడి చేస్తున్నా
రెప్ప మూయకనే ..
గుండె గొంతుకలో
కొట్టుకుంటున్నా
గుబులునాపుకుంటున్నా
సడి సద్దు చేయకనే
ఎదురు చూపులు
ఎడద క్రుంగదీస్తున్న
ఎదిరిస్తున్నా..నువ్వొస్తావని
నిన్నల పై నమ్మికతో..
దరికి చేరుస్తుందనే
నమ్మకమే వమ్ముకాదని
అది జన్మ జన్మల బంధమని
వస్తావుగా నేన్నది నిజమేనని..