కనులపై కలలే అలగవు

 

గజల్         విజయ గోలి

కనులపై  కలలే అలగవు ఎపుడూ

స్నేహం సందడి తరగదు ఎపుడూ

గడచిన వయసును పిలవకు ఇప్పుడు

అలసిన బాల్యం  మరలదు ఎపుడూ

చూపులు రాసిన లేఖల వివరం

కన్నుల అద్దం చెరపదుఎపుడూ

కదలని కాలం  కడలిగ తోచును

జతగా నడకలొ జగడము ఎపుడూ

మౌనం అంటే మోదం కాదులె

విజయం నీదిగ నడవదు  ఎపుడూ

About the author

Vijaya Goli

Add Comment

Language