కనుల వెనుక

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

కనుల వెనుక కలల పొంగు రంగులుగా కదిలి వచ్చె
కొన కొంగున కట్టుకున్న కోరికేదొ కోరివచ్చె

రాలుతున్న ఆకులలో రాగమైన జీవనమే
ఆశలతో చిగురించీ ఆమనిగా తరలివచ్చె

వేకువలో మందారం ముకుళించిన ముగ్ధత్వం
తెలి మంచు తెరలపైన తెలవారగ తేలివచ్చె

చిరు కోపం జడి ఏదో చిరుగాలికి ఎరుకేలే
అలకలనే చిలకలుగా సవరించగ సాగివచ్చె

ముంగిటిలో రంగవల్లి హంగులతో ఇంటి సొగసు
విజయంగా విరిజల్లుల వైభవమే మోసుకొచ్చె

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language