ఆది అంతం

విజయ గోలి.    గజల్ 16/6/20

ఆది అంతం లేనిపయనపు గమ్యమేదో చెప్పగలవా ..

అడుగులోనే ఆవిరయ్యే  ప్రేమలెన్నో చెప్పగలవా

ఎదురుచూపుల దారిలోనే జారిపోయే యుగాలెన్నో ..

కలతలోనే  కరిగిపోయే రాత్రులెన్నో చెప్పగలవా

సుడులుతిరిగే సునామీలో పొంగిపోయే అలలు ఎన్నో

పగటి స్వప్నం  కడలిలోపల అలజడెంతో  చెప్పగలవా .

రూపమెరుగని శిలలపైనా జాలువారిన వెన్నెలెంతో

చంద్రకాంతుల మెరిసిపోయే శిల్పమేదో చెప్పగలవా

సృష్టిలోని  రంగులెన్నో వసంతంలో రాగమెంతో

నరుని నుదుటన విజయమేలే  రాతలెన్నో చెప్పగలవా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language