శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
మరీ మరీ చొచ్చుకోని మనసు లోకి రాకోయి
నీమీదే ప్రేమ పుడితె దాచలేను లేవోయి
మకరందపు రుచులన్నీ గతజన్మల ముడులంటె
మధువు గ్రోలి మరలి పోవు మధుపమంటె వెఱపోయి
ఎదురు చూపు చూడలేను ఎద తలుపు తీయలేను
చిన్ని గుండె మోయలేదు … వియోగాలు బరువోయి
కన్ను కన్ను కలిపి చూడ …కలవరమే కలిగేను
మనసు మనసు మాటాడగ మది దరికి రావోయి
రంగులలో కలలన్నీ రాయలేని గేయాలు
పొందికగా అందగోరు విజయాలే నీవోయి !!