శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
ఎదురుగ నిలిచిన మరణాన్నైనా ఎదిరిస్తేనే భళాభళా
నాకే ఎందుకు .. కష్టాలంటూ ప్రశ్నిస్తుంటే ఎలా ఎలా
బంధాలన్నీ బంధనాలుగా స్వప్నం సందడి చేయును లే
కర్మను నమ్మితె కర్తవ్యాలే జవాబు చెప్పులె అలా ఎలా
కడలిన తేలిన శవమే చెప్పును కఠోర సత్యం నీకు నాకు
జీవం బరువే జీవితమంటే చూడకు మరిమరి ఎలా తెలా
తెల్ల వారితే ఎవరికి ఎవరో తెలిసే ఉంటే మనుషులలో
తామరాకుపై నీటిబొట్టుగా మెరిసే పోదురు తళా తళా
అంకిత భావం ఆద్యం అయితె విజయం నీదే విశ్వంలో
లక్ష్యం కొరకు కక్ష్యలు దాటుట తప్పని దేలే అలా అలా !!