గజల్. విజయ గోలి
పూలబాస తెలుసుంటే పువ్వులాగ నవ్వేవు
మనసుభాష ఎరిగుంటే మౌనాన్నే వీడేవు
కన్నెమనసు కలలతేరు మేఘాలపై తేలేను
వానకారు కోయిలవై ఎదురుచూపు చూసేవు
దరిచేరగ తెలియనటుల దారులేవొ వెతికేవు
హృదినిమీటు వేణువుగా శ్రీరాగం పాడేవు
దొండపండు పెదవులపై దోరనవ్వు దొంగాట
వాలుచూపు సైగలతో చెలిమిచేయ కోరేవు
దాగున్నవి గుండెలలో దాచలేని ప్రేమలే
మాటమాట కలిసినాక వలపుఆట ఆడేవు.