కరోనా. విజయ గోలి
గుండె నిండుగ
గాలి పీల్చి వదిలే
ధైర్యం కరువయ్యింది
అనుక్షణం ఆత్మరక్షణే
బ్రతుకు భారమవుతుంది.
కరుడు కట్టిన కరోనా
కధలు కధలుగ కదుపుతుంది
కలిమి బలిమి పదవి
మతం మలినం పట్టనిదే
కులం కావిడి మోయనిదే
కుళ్ళు లేని కరోనా
మనిషి మనుగడ
మారాలంటూ
మహా సందేశం
అందిపుచ్చుకుంటే
మిగిలివున్న బంధాలకు
ఆయువు పోసే ఆత్మీయం
కొద్దికాలమైన అన్ని జాగ్రత్తలతో
మనల్ని మనం కాపాడుకుంటూ
లేనివాడికి కొంత సాయపడదాం
ఉడుతను ఆదర్శం అంటే
రాముడు నీవెన్నంటే కదా