5 గజల్. రచన -:విజయ గోలి
కట్టుబడ్డ బాటలోన నడకుంటే ఎదురులేదు
యెదిగినాక మాటలోన ఒదిగుంటే ఎదురులేదు
పట్టువిడుపు మనిషికెపుడు ఆటలాగ కదలాలిగ
బ్రతుకంతా బంధాలలొ తడుస్తుంటే ఎదురులేదు
మౌనభాష వ్రాయలేదు కావ్యంగా కూరిమిలో
ఆశలోన శ్వాశలాగ మెదులుతుంటె ఎదురులేదు
వెన్నెలలే వేడితోచు వీడుకోలు విరహాలకు
మనసునిండ మల్లెతనం కదులుతుంటె ఎదురులేదు
అద్దములో ప్రతిరూపు సుద్దులంది * ఓవిజయా
అడుగడుగున అహమంతా విడుస్తుంటె ఎదురులేదు