ముందుగా సమూహ సభ్యులందరికీ *రక్షాబంధన్*శుభాకాంక్షలు💐💐💐
శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం,ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి
అంశం-:సోదరీమణులు ఇంటి మహాలక్ష్ములు
కవన సకినం
నిర్వహణ-:శ్రీమతి సుచరిత గారు
రచన -: విజయ గోలి గుంటూరు
శీర్షిక-:రక్ష
1 అమ్మపేగు జన్మబంధమయ్యి జతగా పెరిగాము..
2 కన్నవారికి కంటి వెలుగు మనమయ్యాము..
3 పుట్టనింటి మమకారం పుట్టెడంట…ఆడపిల్లకు..
4 కళకళల దీపావళి నీ ఇంట నిత్యమై ఉండాలని…
5 అన్నవై కలకాలం ఈ అనుబంధం కాచమంటు..
6 తమ్ముడిగా తలపులలో నన్నెపుడు నిలపమంటు
7 పసిడి పూల పచ్చదనం దీవనలే కానుకగాఇమ్మంటూ..
8 ఏటేట రక్షకట్టి ..బంధాలను బ్రతికించే బహుమతులే కోరేను..