కాకి గూటిలో పెరిగిన కోయిల కూతలు నేర్చింది
మేతను పంచిన కాకి మమతను త్రుంచింది.
కాకి కూతలు నేర్వని కోయిల రెక్కలు కదిపింది
అమ్మ కానీ కోయిల మమతల రాగం పాడిందీ….విజయ గోలి
దుష్యంతుని వీక్షణాలు ..
వెన్నెలలా తాకుతుంటే ..
వనరాణి ..శకుంతలకు ..
వలపు ముల్లు..గుచ్చుకుంది ..
నెచ్చెలులు చూడకుండా ..
నచ్చిన నాధుని చూపులతోనే ..
మది లోచిత్రం గీసే ఆరాటంలో ..
చిరుపాదాలను ముద్దాడిన .
ముల్లు కూడా మల్లె లాగే తోచింది ..విజయ గోలి