మనుషుల మధ్య మాటల వంతెన ..
కట్లు జారి..కడలి కొసకు చేరింది ..
బంధాల బంధనాలు బిగువు జారి ..
బంధించే భావి కొరకు ఆశగా చూస్తున్నాయి ..విజయగోలి
మనిషి మహిషైతే ప్రళయం
మహిషి మనిషైతే ప్రణయం
మానవత్వం మనసు నిండితే మనిషి.
మానవత్వం మంట కలిస్తే మహిషి.
అక్షరాల్లో ఒక్క తేడా ,
అంతరాల్లో ఎంత తేడా …విజయ గోలి