మల్లినాధసూరి కళాపీఠం
చేతివృత్తులు
విజయ గోలి.
చెదిరిపోయెను చేతివృత్తుల
సంబరము..భావి లేదిక ..
బ్రతుకు తెరువు కళలకు
ఇగిరిపోయెను విత్తు లేకనె
యంత్రబలమే ఎదిగి పోయెను
పల్లెటూళ్ళ పందిరి కమ్ములు
పట్నంమోజున పక్షులైనవి
రంగురంగుల బుట్టలల్లే
మేదరన్నకు మెతుకు లేదు
మట్టి తొక్కి సారె తిప్పే
కుమ్మరన్నకు కూడులేదు
నాటువేసి కలుపు తీసి
పంటకోసి ఇల్లు చేర్చే ..
రైతుబతుకు న యంత్రమొచ్చెను
చేతివృత్తుల నిలపమంటుూ
గాంధీ ఎంతో పోరు చేసెను
వృత్తి విద్యల శిక్షణలో
ప్రగతి బాటన వెలుగు నిలిచెను
అండనిలుచును ప్రభుత్వములు
ముందుతరములు ఆధునికత
అవసరాల అదును తెలిసి
వృత్తిబాటన ముందుకెళ్ళును..
వెనుకబడినవి ముందుకొచ్చును..