మల్లినాధ సూరి కళాపీఠం
అర్ధ నారీశ్వరం. విజయ గోలి
శివుడు లేని శక్తి లేదు
శక్తి లేక శివుడు లేడు
శివ శక్తి స్వరూపమే
అర్ధ నారీశ్వరం
ఆలుమగల అన్యరూపం
ఒకరికొకరు ఏకమైన
ప్రకృతి పురుషుల
సృష్టి గతుల గమకములే
అర్ధ నారీశ్వరం
అంబ అంటే అఖిలమే..
అయ్య అంటే ఆది అంతము
అర్ధమిచ్చి అర్ధాంగిగ
అతివ విలువను అధిక పరిచిన
ఆదిదేవుని పూర్ణ రూపం
అర్ధ నారీశ్వరం
తనువు సగము తరుణికిచ్చి
తత్వమరయగ చేసెను
నీవు నేనను భేదమొదిలి
మనది మనమను బాటయే
అర్ధ నారీశ్వరం
సంసారమందున
సగము సగము సంపూర్ణ మంటే
సాగిపోవును సంబరంగ
తత్వమెరిగితె తపన తీర్చును..
అర్ధ నారీశ్వరం