మిత్రులకు హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు💐💐💐💐
శిశిరానికి చిగురు పూతలు..
మంచుతెరలు తొలగిస్తూ ..
ఛైత్రరధం ఆగమనం
వేసవి తొలి వెచ్చదనం
వసంతుని వలపు శరం..
వెండిపూల వాన ల్లే
వేపపూల జల్లు …
తొలిచూలు బరువు తో ..
గున్న మావి తరువు ..
జతిస్వరాలు శృతి చేస్తూ..
కోయిలమ్మ కచ్చేరి..
మావిడాకు తోరణాలు
మల్లెపూల పరిమళాలు
ఛైత్రం చిమ్మిన రంగుల లో
ప్రకృతి పాడే పరవశ గీతం
కోరికలకు క్రొత్త బాట వేస్తూ..
ఉగాదికి నివేదనలు ..
దుర్ముఖి కి శ్రీముఖాలు
హేవళంబి కి స్వాగతాలు..
షడ్రుచులతో సంబరాలు
సర్వ జనులకు శుభాకాంక్షలు !