శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
హరివిల్లున ఇల్లంటే ఎండ వాన కలసినట్లు
రెప్పపాటు కాలంలో రాత మారి పోయినట్లు
ఎంత ఎత్తు ఎదిగిననూ చెట్టు వేరు భూమిలోనె
ఏకొమ్మన పండిననూ నేల పడక తప్పనట్లు
ఊపిరి మువ్వల సవ్వడిలొ ఉదయించును లె జీవం
తెలియకనే లాస్యంలో రాగ రవళి రాలినట్లు
నెత్తిమీద కళ్ళుంటే కానలేడు అగాధమే
మాయ తెరల మంచి కూడ మంచు లాగ కరిగినట్లు
మనిషి బతుకు మర్మానికి మార్గముంటె విజయమేగ
అవని జేరి నీరు తిరిగి అంబరాన చేరినట్లు