స్వేచ్ఛ విజయ గోలి
ఎదుట నిలిచిన గజిబిజి ..ఊహలు ….
ఉప్పెనలా గట్లు తెంచుకుంటుంటే ..
మహోదయానికి ..మహోజ్వల మార్గం నిర్దేశిస్తూ
ఆశయాల ఆచరణలకు ..అంకురార్పణ చేస్తూ ..
అరుణోదయ చైతన్య కిరణాలను …ఆస్వాదిస్తూ ..
నిర్జీవమవుతున్న ..స్వేచ్ఛకు..ప్రాణం పోస్తూ..
చీకటి పంజరాన్ని చీల్చుకుంటూ ..
వేకువ వెలుగుల ..మరో ప్రపంచం లోకి మరోప్రయాణం .. విజయగోలి .