స్వాతంత్ర్య పు రెపరెపలు విజయ గోలి
🌹సాధు రంగు ,శాంతిరంగు..సస్య శ్యామల రంగు..
మువ్వన్నెల మధ్యన ముచ్చటైన నీలిరంగు.
ధరణి మీద ధర్మానికి చిహ్నముగా..
భరతజాతి సంస్కృతిని …విశ్వమంత చాటుతూ..
🌹స్వాతంత్ర్యపు రెపరెపల ..మింటినంటి ఎగురుతుంది
గగనవీధుల ..ఘనమైన …మనఝండా..
విశ్వమంతయు వెలుగొందగా..విజయ పధమున..
శిరసు వంచలేదు ఎక్కడా…….వంచబోదు మరి ఎక్కడ…
అలుపు లేక ఎగిరేను ..ఆచంద్ర తారార్కము..
🌹ఎదురులేక ఎగురుతుంది ..ఎర్రకోటపై మువ్వన్నెల ఝండా
భరతమాత గళమందున మల్లెపూల దండగా
బానిసత్వ సంకెళ్ళు తెగిపడిన చిన్నెలుగా
బలిదానపు యజ్ఞంలో సమిధలైన దివ్వెలుగా🙏🏻🙏🏻🕊🕊🕊
🌹కరకు రాతి తూటాలకు ఎదురొడ్డిన గుండెలకు
దేశమాత శ్వాసకు స్వేచ్ఛాయువు లిచ్చిన …
ధీరులకు ..అమర వీరులకు..తొలివందనం🙏🏻🙏🏻🕊🕊💐💐
స్వాతంత్ర్యపు వెలుగు దారి వేడుకలో..
స్మరియిద్దాం మార్గదర్శులందరిని మలివందనంగా🙏🏻🙏🏻🌹🌹🌹
🌹గర్వ పడుము భారతీయుడా…భారతాన జన్మించినందుకు..
ఏదేశమేగినా ….భరతజాతి …నాదేనని చెప్పేందుకు…..
దేశభక్తి గుండెనిండ …చెయ్యెత్తి ప్రణమిల్లు *జైహింద్ *అని🙏🏻🙏🏻🙏🏻🕊