శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
స్నేహములో మదుగులుంటె మధురిమలే ఇగిరి పోవు
చేయిచాచి నెయ్యమంటె నిరసనలే కరిగి పోవు
వొదిగుంటే ఒప్పుతుంది వినయమెపుడు మాటలలో
భాషదాచి భారమంటె భావాలే కదిలి పోవు
మాయపొరలు తొలగిపోతె విశ్వమంత సుందరమే
ధర్మగుణం దరిచేరితే దానవతే బెదిరి పోవు
ఎప్పుడెవరు ఎవరికెవరు జన్మలన్నీ ఋణములతో
మలుపుతిరుగు మనుషులతో బంధాలే నలిగి పోవు
చెదరనిదే నేస్తమంటు సన్నాయే పాడుతుంది
“విజయ” తోడు నడకంటే వివాదాలే ఎగిరి పోవు