శ్రీ మల్లినాధసూరి కళాపీఠం
ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి
అంశం-:స్నేహం దృశ్య కవిత. 28/7/2020
నిర్వహణ-: శ్రీమతి సంధ్యా రెడ్డి గారు
రచన -:విజయ గోలి. గుంటూరు
శీర్షిక-:చెలిమి కలిమి
స్నేహమంటే నవ్వులు
నవ్వులలో ..పరిమళాలు..
వెదజల్లే..పారిజాత పువ్వులు..
చిన్ననాటి చిలిపితనపు…
జ్ఞాపకాల గుబాళింపు..
వయసు వలపు సరిగమలో
రహస్యాలు దాచుకున్న…
తొలి ప్రేమల ఖజానాలు
అడుగు తడబడితే…
ఆసరాని అందించే హస్తం
నవ్వు వెనుక నీడలలో
ఓదార్పుల వెన్నెల ..
ఒడిదుడుకుల వేళలో..
కన్నులలో కన్నీరై నిలిచేటి..
బాధ్యతల బంధమే స్నేహం
పరిధి లేని స్నేహానికి..
స్నేహానికి ఒక రోజంటూ
గిరి గీస్తే నవ్వుతుంది..స్నేహం
కలిమిలెన్ని ఉన్నా
చెలిమి కలిమి లేని నాడు
జీవనమే….శూన్యం….