మల్లినాధసూరి కళాపీఠం
సోనూసూడ్ అతని పేరు…
మనసు మాత్రం మేలిమి సోనం
కరిగి పోవు కరుణారసమే అతడు
కరోన కరకు పాదాలక్రింద నలిగిన..
కర్మచారులకు రక్షిత గొడుగై నిలిచాడు..
పాదచారులకు ప్రాణదాత అతడు..
ఆగే గుండెలకు కదలిక తానై నిలిచాడు
కన్నీటి కాలువలకు వారధి కట్టి చేయూతనిచ్చాడు
అడగకనే అందరికీ అండగ నిలిచాడు
ప్రతినాయకుడైన దాత కర్ణుడే అతను
ఇంటింటను వెలిగిన దీపమతడు..
కులాల కుళ్ళులు ..మతాల మంటలు..
రాజకీయపు రంగులంటని నిస్స్వార్ధుడు
మలిన మంటని మహా మనీషిగా…ఎదుగుతునే.. ఉండాలి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻