సుమధుర సుప్రభాతాలు

సుపరిచిత ..సుమధురసుప్రభాతాలు …విజయ గోలి

ఆకుకూరల కేకల ఆరోహణ ..అవరోహణలు ..

పక్కింటి పనిమనిషి చీపురు శృతి ..లయలు

సాయిబాబా  అభిషేకాల గోత్రనామాలు

గుక్క తిప్పని పూజారి గొంతులోశంకర్ మహదేవన్ ..

ఎదురింట్లో మేడపైన క్రొత్త జంట కాఫీల సరాగాలు ..

అద్దెకున్న వారిపై పక్కింటి ఓనర్ గారి నీటి తూటాలు

ఎడమవైపు మామ్మగారి భక్తి ఛానల్

మార్మ్రోగిపోయే విష్ణుసహస్ర నామాలు

కిటికిలోనుండినా చెవులు మెలేస్తూ

మేలుకొలిపే సుపరిచిత సుప్రభాతాలు

నా మనసుతో ..పెనవేసుకున్న ..సుమధుర బంధాలు ..

                                                             

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language