సుప్రభాత బంధాలు

సుప్రభాత బంధాలు   విజయ గోలి

సుపరిచిత ..సుమధుర …సుప్రభాతాలు …

ఆకుకూరల కేకల ఆరోహణ ..అవరోహణలు ..

పక్కింటి పనిమనిషి చీపురు శృతి ..లయలు …

సాయిబాబా అభిషేకాల గోత్రనామాలు …

గుక్క తిప్పని పూజారి గొంతులో …శంకర్ మహదేవన్ ..

ఎదురింట్లో మేడపైన క్రొత్త జంట కాఫీల సరాగాలు
..
అద్దెకున్న వారిపై పక్కింటి ఓనర్ గారి నీటి తూటాలు …

ఎడమవైపు మామ్మగారి భక్తి ఛానల్ …

మార్మ్రోగిపోయే విష్ణుసహస్ర నామాలు …

కిటికిలోనుండి …నా చెవులు మెలేస్తూ …

మేలుకొలిపే …ఈ సుపరిచిత సుప్రభాతాలు …

నా మనసుతో ..పెనవేసుకున్న ..సుమధుర బంధాలు ..
విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language