సత్యం శివం సుందరం

 

మల్లినాధ సూరి కళాపీఠం

సత్యం శివం సుందరం      విజయ గోలి

రాకపోకల కథలు వ్రాసేది పైవాడు
బ్రతుకు నాటకము నడిపేది వాడే
కర్మఫలముల మోత పంచేది వాడే
పరమ పదము చెంత కాపు వాడే

ముక్కంటి కనుసైగ ముజ్జగములాడు
జోగియై తానుండి భోగమే తెలిపేను
సన్నిధిని చేరితే పెన్నిధిగ నిలిపేను
రాయివీ నీవే రాజువు నీవే బంటువు నీవే

కనులు తెరిచిన నుండి మూసేంతవరకు
కదలికల కావ్యము వ్రాసినాడెపుడో..
ఏడుపుతో వచ్చావు ఏడుపుతో పొమ్మంటూ
నడిమ నవ్వుల సంగతి నేనేనంటాడు

మేలుకొలిపి నీకు మెట్లు చూపేను
అలుపు లేకుండ అదుపు చూపేను
ఆటంతా విడమరచి ఆడి చూపేను
ఆడుకోమంటు వేడుకే చూసేను

నీటిబుడగలో నిన్నునిలిపి ఆటలాడేను
ఏడుఅడుగుల నేల ఏలుకోమంటాడు
సత్యమెరిగితే నీవు నిత్యమై వుంటావు.
శివమెరిగి తిరిగితే భవుడవే నీవు
శూన్యమేమిటొ చూస్తే సుందరమే నీవు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language